అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ముఠా కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కార్మిక, కర్షక భవనంలో శనివారం జరిగింది. ఈ సమావేశంకు సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు హాజరై మాట్లాడుతూ ... అనకాపల్లి జిల్లాలో వేలాది మంది ముఠా కార్మికులు గా పనులు చేస్తున్నారని, వీరికి ఎటువంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదని తెలిపారు. కార్మికులుగా గుర్తింపు లేదని, కూరగాయల మార్కెట్, షాపులు, ఐరన్, సిమెంట్, పప్పులు, రైస్ ఆయిల్ గ్రానైట్ , వివిధ పరిశ్రమల్లో రైల్వే, బస్టాండ్ లో ఎగుమతి దిగుమతి చేస్తూ ఎండల్లో, వానల్లో ముఠా కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని, నేటికీ ఆ హామీ అమలు కాలేదని చెప్పారు. పిఎఫ్, ఈఎస్ఐ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా అమలు చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ముఠా కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్.రాము, ముఠా సంఘం జిల్లా అధ్యక్షులు జి.అప్పారావు, కార్యదర్శి కె.అప్పలరాజు, బర్ల రమణ, మంద.రాము, రాజన్న సత్తిబాబు, జే.సోమనాయుడు, రమణ, నానాజీ, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)