భువనేశ్వర్ : కారు అదుపుతప్పి జలపాతంలోనికి దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందిన ఘోర ఘటన శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్ మాల్వా జిల్లా నల్కేద వద్ద జరిగింది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని జయదేవ్ విహారకు చెందిన ఎనిమిది మంది ఉజ్జయిని బగళాముఖి అమ్మవారి దర్శనానికి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు.. నల్కేద వద్ద అదుపుతప్పి జలపాతంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జలపాతంలోకి దూసుకెళ్లిన కారు - 8 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)