ప్రజాశక్తి - దేవరపల్లి : అనకాపల్లి జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లిన దంపతుల ఇంటిని టార్గెట్ చేసిన గుర్తుతెలియని దుండగులు... బీరువా తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. దేవరాపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన చొక్కాకుల ఎరుకునాయుడు, ఆయన భార్య మంగళవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టారు. బీరువాలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు అపహరించి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు చోరీ జరిగిన విషయం గుర్తించి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై బుధవారం దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కె.కోటపాడు సీఐ కృష్ణ, దేవరాపల్లి ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)