బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దిగ్విజయంగా ముగిసిన 70వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

1 గంట క్రితం

దిగ్విజయంగా ముగిసిన 70వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 09:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- బాలుర, బాలికల విభాగాల్లో కడప జట్లకు ప్రథమ స్థానం

- జాతీయస్థాయి పోటీలకు ప్రతిభావంతులైన క్రీడాకారుల ఎంపిక


ప్రజాశక్తి - హిందూపురం

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయి పోటీలు ఎంతగానో దోహదపడతాయని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొరార్జీ యాదవ్ తెలిపారు. స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి అండర్‌-14 బాలబాలికల హాకీ పోటీలు మంగళవారం దిగ్విజయంగా ముగిశాయి. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. బాలుర విభాగంలో వైఎస్సార్ కడప జట్టు ప్రథమ స్థానం సాధించగా, అనంతపురం జట్టు ద్వితీయ స్థానం, విశాఖపట్నం జట్టు తృతీయ స్థానం కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలోనూ వైఎస్సార్ కడప జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతపురం జట్టు ద్వితీయ స్థానం, చిత్తూరు జట్టు తృతీయ స్థానం సాధించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఉమెన్ హాకీ కోచ్‌గా పనిచేసిన మధు కరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, సంధ్యారాణి, టోర్నమెంట్ పరిశీలకులు ప్రవీణ్ కిరణ్, ఫిజికల్ డైరెక్టర్లు సురేష్ కుమార్, లోకనాథ్, మహేష్ బాబు, మహేష్ దీపక్, సురేష్, మారుతి ప్రసాద్, శివకుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్