బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో దారుణం: కేఫ్‌లో యువతిపై తోటి ఉద్యోగుల సామూహిక అత్యాచారం

1 గంట క్రితం

ఢిల్లీలో దారుణం: కేఫ్‌లో యువతిపై తోటి ఉద్యోగుల సామూహిక అత్యాచారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 09:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఒక కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై తోటి ఉద్యోగులే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.


పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు, ఆరుగురు నిందితులు కర్కర్డూమా ప్రాంతంలోని ఒక మాల్‌లో ఉన్న కేఫ్‌లో కలిసి పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి అందరూ కలిసి పార్టీ చేసుకోవడానికి కేఫ్‌లో సమావేశమయ్యారు. రాత్రి 11.30 గంటల సమయంలో కేఫ్ మూసివేసినప్పటికీ, నిందితుల్లో ఒకరి వద్ద తాళాలు ఉండటంతో తిరిగి కేఫ్‌ తెరిచి లోపల పార్టీ చేసుకున్నారు.


ఈ క్రమంలో అందరూ కలిసి మద్యం సేవించి, తెల్లవారుజామున 3.30 గంటల వరకు అక్కడే గడిపారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, అక్కడే ఉన్న మిగిలిన సహోద్యోగులు ఆ నేరానికి సహకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని, ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్