రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలోని నేతాజీ రోడ్డు వద్ద సన్న బియ్యం పంపిణీ కౌంటర్ ను స్థానిక శాసన సభ్యులు కాలవ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లో ధరణి పథకం కింద కేఎన్ఎమ్ బిపిటి రకం సన్నబియ్యాన్ని ఒక్కో ఆధార్ కార్డుకు 26 కిలోల బస్తా 1300 రూపాయలు చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో సక్రమంగా సకాలంలో వర్షాలు కురవని కారణంగా వరి పంట దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చౌక ధరలకే సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో రాయదుర్గం అనంతపురం తాడిపత్రి పట్టణాలలో ఈ కౌంటర్లు ఏర్పాటయ్యాయన్నారు. రాయదుర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టంకశాల హనుమంతు, తహసిల్దార్ సూర్య ప్రతాప్, డిప్యూటీ తహసిల్దార్ శ్యామ్ రాయ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సన్న బియ్యం పంపిణీ కౌంటర్ ప్రారంభం
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)