శృంగవరపుకోట : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో టిడిపి గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం సానుభూతిపరులు సర్పంచులుగా నామినేషన్ వేశారు. దీంతో ఒక అభ్యర్థి జుత్తాడ భవాని, మరో అభ్యర్థి కనిశెట్టి సత్యవతి తెలుగుదేశం కండువాలు కప్పుకుని జెండాలు పట్టుకొని పోటాపోటీగా ఊర్లో ప్రసారం చేస్తున్నారు. మంగళవారం జుత్తాడ భవానికి మద్దతుగా ఎంపీ భారత్, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, వైస్ ఎంపీపీ రాయవరపు చంద్రశేఖర్ మరియు తెలుగుదేశం నాయకులు ప్రచారానికి వెంకటరమణపేట గ్రామానికి వెళ్లగా, కనిశెట్టి సత్యవతి భర్త కనిశెట్టి ఈశ్వరరావు వర్గీయులు ఎంపీ తో పాటు మిగతా వాహనాలను అడ్డుకొని ఊర్లోకి ప్రసారానికి రానీయలేదు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం వెంకట్రాంపేట జంక్షన్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సిఆర్పిఎఫ్ బలగాలు కూడా మోహరించారు.
ఎంపీ భరత్ వాహనం అడ్డగించిన టిడిపి నాయకులు
36 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)