మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్యాంకర్‌ లారీని ఢీకొన్న జీపు : ఐదుగురు మృతి

40 నిమిషాల క్రితం

ట్యాంకర్‌ లారీని ఢీకొన్న జీపు : నలుగురు మృతి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భోగాపురం : విజయనగరం జిల్లా భోగాపురం జాతీయరహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం వైపు నుంచి వస్తున్న జీప్ అదే వైపు నుంచి వచ్చి ఆగి ఉన్న ట్యాంకర్ లారీని బలంగా ఢీకొంది. దీంతో జీపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీప్ లో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీప్ నుజ్జనుజ్జు అవ్వడంతో డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు. దీంతో వారి వివరాలు తెలుసుకోవడానికి ఆలస్యమయ్యింది. జీప్ డోర్స్ తెరిచేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. మృతులు వాకలపూడి శ్రీను, కుసుమ రంజని, బొర్రా సతీశ్, బొర్రా శృతి, కొండపు సూరిబాబు లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
vzm

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్