మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పొలం పిలుస్తోంది కార్యక్రమం

1 గంట క్రితం

'The Farm is Calling' Program
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీమతి ర్.కాత్యాయని మాట్లాడుతూ పంటల బీమా పథకం ప్రాముఖ్యత, అర్హత, నమోదు విధానం మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట బీమా రైతులకు అందించే ప్రయోజనాల గురించి వివరించారు. కేవీకే రెడ్డిపల్లి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డా. బి. చందన ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేల తేమ సంరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, వాతావరణ ఆధారిత వ్యవసాయ యాజమాన్య పద్ధతులు మరియు  పంటలో 19:19:19 నీటిలో కరిగే ఎరువును 1% ద్రావణంగా ఆకులపై పిచికారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.అనంతరం అధికారులు మొక్కజొన్న మరియు బత్తాయి తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించి పంటల ఎదుగుదల, నేలలో తేమ పరిస్థితులు, చీడపీడలు మరియు వ్యాధుల ఉనికిని పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని పంట పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (MAO), కాత్యాయని వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త, కేవీకే రెడ్డిపల్లి, డా. బి.చందన వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), నాగిరెడ్డి, విహెచ్ఎ రవితేజ రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్