ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని పాడి రైతులకు సబ్సిడీతో అందిస్తున్న పశువుల దానా లో పశువైద్యాధికారి జ్యోతి చేతివాటం ప్రదర్శిస్తున్నారని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలో పాడి రైతులకు 1200 ఉన్న 50 కేజీల బ్యాగును సబ్సిడీతో 600 రూపాయలతో పంపిణీ చేశారు. వీటిలో పశువైద్యాధికారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు బస్తాల నుంచి మూడు బస్తాలు సబ్సిడీ పశువుల దాన పంపిణీ చేసి మిగిలినవారికి లేవని చెప్పడంతో ఒక్కసారిగా పాడి రైతులు పశు వైద్యాధికారి ని ప్రశ్నించడంతో స్టాకు కొన్ని వచ్చాయని అందుకే కొంతమందికే ఇచ్చామని తెలిపారు. పశువుల దాన సబ్సిడీ లేకుండా వచ్చినప్పుడు ప్రతి పాడి రైతుకు ఫోన్లు చేసి దానా తీసుకెళ్లాలని చెప్పిన మీరు సబ్సిడీ దాన వచ్చినప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదని పాడి రైతులు పశువైద్యాధికారిని నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక డోరు వేసుకుని గదిలో ఉండిపోయారు. దీన్నిబట్టి పాడి రైతులు పశు వైద్యాధి కి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే సబ్సిడీ పశుదానం పంపిణీ చేశారని ఆందోళన చేశారు. వెంటనే పశువైద్యాధికారిపై చర్యలు తీసుకొని అర్హులైన పాడి రైతులకు సబ్సిడీ పశువుల దాన పంపిణీ చేయాలని పాడి రైతులు కోరారు.
సబ్సిడీ పశువుల దానాలో పశువైద్యాధికారి చేతివాటం
26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)