సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ..

17 నిమిషాల క్రితం

Training on conducting panchayat elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణ ప్రక్రియలో భాగంగా మండల కేంద్రంలోని బొబ్బ జయశ్రీ జడ్పీ గర్ల్స్ హైస్కూల్ నందు సోమవారం ఎన్నికల విధులపై పిఓలకు,ఏపిఓలకు ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో ఎంఓటి దుర్గాప్రసాద్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 208 పోలింగ్ బూతులకు సంబంధించి ఎన్నికల సిబ్బందిగా హాజరైన వారందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఎంఈఓ లు అప్పాజీ, రాజు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, టైపిస్ట్ వలీ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్