సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవీఎంసీలో 119 మంది కార్పొరేటర్ల సామూహిక ప్రమాణ స్వీకారం

31 నిమిషాల క్రితం

విశాఖ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ ఎన్నిక


ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నూతన కౌన్సిల్‌కు ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కౌన్సిల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో 119 మంది నూతన కార్పొరేటర్లు సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త కిషోర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజాసేవకు అంకితమై తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు. నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. నూతన కౌన్సిల్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టే ప్రక్రియలో సామూహిక ప్రమాణ స్వీకారం కీలక ఘట్టంగా నిలిచింది. అయితే ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్ ముక్కా శ్రావణి, కార్పొరేటర్ నీలవేణి హాజరుకాలేదు. మిగిలిన 119 మంది కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో నూతన కౌన్సిల్ కార్యకలాపాలకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. కాగా, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి జనసేన పార్టీకి చెందిన 37వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. దీంతో అతడు ఏకగ్రీవం గా ఎన్నిక అయినట్టు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త కిషోర్ ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్