ప్రజాశక్తి-మదనపల్లె టౌన్ (అన్నమయ్య) : అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి తీసుకొచ్చి, చికిత్స పొందుతున్న సమయంలోనే అక్కడ వదిలి వెళ్లిన అమానుష ఘటన మదనపల్లెలో వెలుగుచూసింది. నాలుగు రోజుల క్రితం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వృద్ధుడిని వదిలి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయనను పట్టించుకునే వారు లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రస్తుతం విషమంగా ఉందని ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు బుధవారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం ఉప్పినిపల్లికి చెందిన నరసింహులు కుమారుడు అగిర్తప్ప (60) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చి వదిలి వెళ్లినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతడిని ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిన వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్ నంబర్ 9391740343గా వైద్య సిబ్బంది తెలిపినట్లు పోలీసులు వివరించారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆసుపత్రికి చేరుకుని బాధితుడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పోలీసులు కోరారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తండ్రిని ఆసుపత్రిలో వదిలి వెళ్లిన బిడ్డలు
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 02:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)