ప్రజాశక్తి-శంఖవరం : అన్నవరం దేవస్థానం నూతన కార్య నిర్వహణ అధికారిగా కె లక్ష్మీ శివ జ్యోతి బుధవారం బాధ్యతలు చేపట్టారు ముందుగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు వేద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఈవో లక్ష్మి శివజ్యోతి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాను దేవస్థానం పాలనాధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేశానని తన పరిశీలనలో కొన్ని విభాగాల పరిస్థితులు బాగానే ఉన్నాయని అయితే అక్కడక్కడ శానిటేషన్ సమస్యలు ఉండడం గమనించానని అవి పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈవో కె లక్ష్మీ శివ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో లక్ష్మీ శివ జ్యోతి కి పలువురు ఉద్యోగులు వ్రత పురోహితులు అభినందనలు తెలిపారు.
రత్నగిరి నూతన ఈవో శివజ్యోతి బాధ్యతలు స్వీకరణ
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)