ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : బాపట్ల కూటమి నుంచి బిజెపి పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ తనకు కేంద్రంలో, రాష్టంలో పదవులు ఇప్పిస్తానని తన వద్ద రూ.85లక్షలు తీసుకోని ఎటువంటి పదవులు ఇప్పించకుండా మోసం చేశారని కర్నాటక రాష్ట్రం బాగేపల్లి నియోజకవర్గానికి చెందిన రవీందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బాపట్లలో రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ... ఇస్కా సునీల్ కుమార్ కేంద్రంలో, రాష్ట్రంలో పెద్దలు తెలుసని ఏ పదవి కావాలన్నా ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ఆర్థికంగా మోసం చేశారని చెప్పారు. నాలాగా ఇంకా దేశవ్యాప్తంగా మోసం చేశాడు అని చెప్పాడు. తను ఇస్కా సునీల్ కుమార్ కు రూ.47 లక్షలు బ్యాంకు ద్వారా రవీందర్ రెడ్డి ఖాతా నుంచి సునీల్ బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు చెప్పారు. తాను మోసపోయినట్లు తేలడం తో తగిన ఆధారాలతో బెంగళూరు జిల్లా, జేసీ నగర్ సబ్ డివిజన్ టి నగర్ పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చేయగా న్యాయస్థానం ఆదేశంతో పోలీసులు 04-10-2026 తేదిన క్రైం నెంబర్ 352/2026 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని, సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా సునీల్ ఇస్కా బాపట్ల పురపాలక ఎన్నికలలో చైర్మన్ గా పోటీ చేస్తునాడు అని తెలిసి న్యాయం చేయమని ఇక్కడికి వస్తే పటేల్ నగర్ లోని పార్టీ కార్యాలయం నుంచి తనని బలవంతంగా బయటకు నెట్టివేశారు అని తెలిపాడు. సునీల్ దేశం వ్యాప్తంగా ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని ధైర్యంగా తాను ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా ముందుకు వచ్చానన్నారు. ఇస్కా సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం జరగడం కోసం మీడియా ముందుకు వచ్చానని తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
బాపట్ల కూటమి తరపున బిజెపి నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఇస్కా సునీల్ పై ఆరోపణలు
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 02:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)