ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య) : మండల కేంద్రమైన కలకడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధార్ నమోదు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాఠశాలలో ఇప్పటివరకు ఆధార్ నమోదు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆధార్ కేంద్రానికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా పలకరించి, వారి ఆధార్ నమోదు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ క్యాంపును పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)