శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కదిరాయి చెరువు సచివాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

3 రోజుల క్రితం

checkings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలకడ: కదిరాయ చెరువు సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని కదిరాయి చెరువు స్వర్ణ గ్రామంలో ఉన్న సచివాలయాన్ని తనిఖీలు చేసి తగు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలిపారు.సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి, విధులకు హాజరుకావాలని సూచించినట్టు తెలిపారు. అనంతరం రికార్డులు, హాజరు పరిశీలించినట్లు తెలిపారు.సచివాల సిబ్బంది ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కొడతా ఏర్పడే అవకాశాలు ఉన్నందువల్ల త్రాగునీరు సాగునీరు తదితర వాటిపై దృష్టి సారించి గ్రామాల్లో ప్రజలు నీటిని పొదుపుగా వాడేలా చర్యలు చేపట్టాలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్