ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బి.కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ బాధ్యతలు

24 సెప్టెంబర్, 2026

ci.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–బి.కొత్తకోట: బి.కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ సీఐగా కళా వెంకటరమణ నియమితులయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ గోపాల్‌రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో కళా వెంకటరమణను రెగ్యులర్‌ సీఐగా నియమించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బి.కొత్తకోట పట్టణం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన కళా వెంకటరమణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్