ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టులో మెరిసిన పీలేరు కుర్రాడు
సబ్-జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విజయం
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : సబ్-జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించడం అభినందనీయమని ఆదివారం పీలేరు క్రీడాభిమానులు తెలిపారు. ఈ విజేత జట్టులో పీలేరుకు చెందిన కుర్రాడు జీవన్ చోటు దక్కించుకుని తన ప్రతిభను చాటుకోవడం పీలేరుకు గర్వకారణమని అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు తరఫున బరిలోకి దిగిన జీవన్ తన ఆటతీరుతో ఆకట్టుకుని జట్టు విజయంలో భాగస్వామ్యమయ్యాడు. చిన్న వయసులోనే బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా స్థాయికి ఎదగడం పట్ల పీలేరు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులకు, అలాగే కుమారుడిని క్రీడారంగంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రు భార్గవి, సుబ్రహ్మణ్యం లకు పలువురు అభినందనలు తెలిపారు. జీవన్ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. అలాగే హలో పీలేరు టీం తరఫున జీవన్‌కు ప్రత్యేకంగా అభినందనలు, ఆల్ ది బెస్ట్ తెలిపారు.








కామెంట్‌లు (0)