మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లీడర్‌షిప్, ఎంట్రప్రెన్యూర్షిప్‌పై విద్యార్థులకు అవగాహన

1 గంట క్రితం

east godavari-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : గవర్నమెంట్ కాలేజ్ (ఆటోనమస్), RTIH రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో ‘లీడర్‌షిప్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్’ అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బొమ్మూరు లోని ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ మావియాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (MAPL) మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రస్తుత వినియోగాలు, వివిధ ఆధునిక రంగాల్లో దాని ప్రాధాన్యం, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న అవకాశాలను ఆయన వివరించారు. శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక సవాళ్లను అధిగమిస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తన ప్రయాణాన్ని గణేష్ విద్యార్థులతో పంచుకున్నారు. వైఫల్యాలను అవకాశాలుగా మలుచుకోవడం, సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, ఉద్యోగ అవకాశాలతో పాటు స్టార్టప్‌ల స్థాపన వైపు కూడా దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డ్రోన్ డిజైనింగ్, తయారీ, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్.కె., వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి వసంత లక్ష్మి, IIH కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. బేబీ నిర్మల, IIC కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. దుర్గాలక్ష్మి, అకాడెమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. రాజేశ్వరి, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.ఎ. అన్నపూర్ణ, IIH సభ్యురాలు శ్రీమతి షేక్ జరీనా, RTIH ఇన్క్యుబేషన్ హెడ్ చంద్రప్రకాశ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులకు డ్రోన్ డిజైనింగ్, తయారీ ప్రక్రియ, పరిశ్రమలోని అవకాశాలపై ప్రత్యక్ష అవగాహన లభించింది. ప్రతిభ ఆధారంగా ఎంపికైన కొంతమంది విద్యార్థులకు మావియాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ తెలిపారు. ఈ అవకాశం విద్యార్థులకు డ్రోన్ తయారీ పరిశ్రమపై మరింత లోతైన అవగాహన పొందేందుకు దోహదపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్