శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి విలేకరి కి టిడిపి, పోలీసుల బెదిరింపు

22 అక్టోబర్, 2026

TDP and police threaten Prajasakti reporter
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సోమల (అన్నమయ్య) : సోమల ప్రజాశక్తి విలేకరి ఫోటోలను తీస్తుండగా ... టిడిపి కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ లాక్కొని 'ఎవరు నువ్వు ఎందుకు ఫోటోలు తీస్తున్నావ్` అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడే ఉన్న కొందరు సీనియర్ టిడిపి నాయకులు సర్ది చెప్పి వారిని పంపించి వేయడంతో విలేకరికి దాడి నుండి ఉపశమనం కలిగింది. స్థానిక సినిమా క్రాస్ వద్ద పోలీసులు ముళ్లకంచెను రోడ్డుపై పూర్తిగా వేయడంతో అదే సమయంలో 108 వాహనం రావడం, వాహనం పోవడానికి దారి లేకపోవడంతో గమనించిన ప్రజాశక్తి వీడియో, ఫోటోలు తీయగా అక్కడే ఉన్న ఎస్ఐ పోలీసులు కలిసి విలేకరిని చుట్టుముట్టి ఆ వీడియోను డిలీట్ చేయాలని సెల్ఫోన్ లాక్కుని వారే మొబైల్ ఫోన్ లోని వీడియోలను ఫోటోలను డిలీట్ చేశారు. స్వేచ్ఛగా విలేకరి ఫోటోలు తీయడానికి వాస్తవాలు రాయడానికి లేని పరిస్థితి మండలంలో ఏర్పడింది. ప్రజాశక్తి విలేకరి పై జరిగిన సంఘటనలను మండలంలోని ఇతర పత్రికా విలేకరులు తీవ్రంగా ఖండించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్