బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రెవెన్యూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

1 గంట క్రితం

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

ప్రజాశక్తి-కలికిరి: రెవిన్యూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం అని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలం లోని రెడ్డివారి పల్లి గ్రామంలో పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాసుబుక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీ సర్వే కార్యక్రమం పేరుతో అడ్డదిడ్డంగా ర్వే నిర్వహించి పట్టాదారు పాసుబుక్కులు పైన సర్వే రాళ్లపైన జగన్ మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకొని ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా రైతులందరికీ గొడవలు సృష్టించాడని విమర్శించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని రీ సర్వే చేయించి తప్పులు సరిదిద్ది ఎవరి భూమి పై వారికి హక్కు ఉండేలా రాజు ముద్ర వేసి రైతులకు పట్టాదారు పాసుబుక్కులు అందజేస్తున్నారని అన్నారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నే సిబ్బంది దగ్గరికి వెళ్లి సరిదిద్దుకోవాలని రైతులకు సూచించారు రైతులకు ఎలాంటి భూ సమస్యలు ఉన్న పీలేరులో నే ఆర్డీవో కార్యాలయం రైతులందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడికి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. గత 65 సంవత్సరాలుగా కలికిరి మండల ప్రజలు మా కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్నారని వారికి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే చేయడానికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. గత ప్రభుత్వంలో బలరం మదనపల్లి మండల నిర్లక్ష్యం చేసే రావిచెట్టు జిల్లాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మదనపల్లి జిల్లా కోసం పోరాడమని తరువాత ఓటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లతో మాట్లాడి మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అలాగే పీలేరును కూడా ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని తెలిపారు. అనంతరం పీలేరు ఆర్డిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమం పూర్తి కావచ్చిందని ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు ఉమ్మడిగా ఎంతో కష్టపడి ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేశారని వారిని అభినందించారు. మరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రెవెన్యూ కార్యాలయంలోకి వెళ్లి సరిచేసుకోవాలని రైతులకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి రైతులకు పట్టాదారు పాసు బుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి టిడిపి అధ్యక్షుడు షాబుద్దీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి, ఉపాధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు యోగేష్ రెడ్డి, నాయకులు నిజాముద్దీన్, శ్రీనివాస్ వర్మ, తాసిల్దార్ సయిద్ అహ్మద్, ఎంపీడీవో భాను మూర్తి రావు, ఈఓ అశోక్ , రెవెన్యూ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్