ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోకాళ్లపై కూర్చొని వీఆర్ఏ ల నిరసన

18 సెప్టెంబర్, 2026

VRAs protest by sitting on their knees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మూడో రోజుకు చెందిన వీఆర్ఏల దీక్ష


ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ... వీఆర్ఏ లు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం పీలేరు తహశీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు పే స్కేల్‌ అమలు చేయాలని, మృతి చెందిన వీఆర్ఏల నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ఉద్యోగిోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తాము తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ నాయకులు కె. నాగరత్నం, పి. ఆంజనేయులు, జి. వెంకటరమణ, రవి, పి. ధనలక్ష్మి, జి. ఆదినారాయణ, మనోజ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్