శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో వేపాడ విద్యార్థుల ప్రతిభ

1 గంట క్రితం

vepada-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రథమ, తృతీయ స్థానాలు కైవసం

ప్రజాశక్తి - వేపాడ : జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో వేపాడ మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖాధికారులు ఎన్. నాగభూషణరావు, పి. బాలభాస్కరరావు శుక్రవారం తెలిపారు. సెప్టెంబరు 17న నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో “Energy Basket 2047 – Prospects & Challenges” అనే అంశంపై జిల్లాలోని 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో వేపాడ మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి ఎం. అరవింద్ ప్రథమ స్థానం, సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి పి. బాలాజీ మణికంఠశ్రీ తృతీయ స్థానం సాధించారు. అరవింద్‌కు గైడ్ టీచర్లుగా ఆర్. ఈశ్వరరావు, పి. బేబీరాణి, బాలాజీకి బీపీఏ రాజు, బి. శ్రీనివాసరావు వ్యవహరించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఎం. అరవింద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై జిల్లా తరఫున హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా శివారు మండలమైన వేపాడకు సైన్స్ సెమినార్‌లో రెండు స్థానాలు దక్కడం మండలానికి గర్వకారణమని ఎంఈవోలు పేర్కొంటూ విద్యార్థులు, గైడ్ టీచర్లను అభినందించారు.



vepada

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్