ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ .... సోమవారం వీఆర్ఏ లు అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు ఈరోజు పీలేరు తహశీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ .... విఆర్ఎ లు తమ కోర్కెల సాధన కోసం ఉద్యమం చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయం అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లయిన పే స్కేల్ అమలు చేయాలని, మృతి చెందిన వీఆర్ఏల నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ఉద్యోగిోన్నతులు కల్పించాలని, వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు తాము తమ దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘ నాయకులు కె. నాగరత్నం, రవి, పి.ఆంజనేయులు, జి.వెంకటరమణ, పి.ధనలక్ష్మి, జి.ఆదినారాయణ, మనోజ్, రమణ, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)