.. పట్టించుకోని పై అధికారులు
.. ప్రజలకు అందుబాటులో ఉందని సిబ్బంది.
.. లోపించిన జవాబుదారితనం.
.. కొంతమంది సిబ్బందికి అధికారుల అండ దండలు.
ప్రజాశక్తి పర్చూరు (బాపట్ల) : ఎవరు ఎట్లా పోతే మనకెందుకులే నెల నెల నా జీవితం నాకు వస్తుందిలే పని చేయకపోయినా పర్వాలేదు అన్నట్లుగా పేరు మార్చుకున్న స్వర్ణ గ్రామ సచివాలయల సిబ్బంది వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సర్వేలను కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. తమ పై అధికారులు సర్వే ఇస్తే మేము చేయాల్నా అన్న నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బంది సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారు. మరికొందరు సిబ్బంది పని ఒత్తిడి సాకు చూపిస్తున్నారు. సర్వేలు చేయమంటూ భీష్మించుకుంటున్నారు. వేరే వాళ్ళు చేయాల్సిన సర్వేలను మేమెందుకు చేయాలంటూ అధికారుల వద్ద అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు. ఇది పర్చూరు మండలంలోని సచివాలయ సిబ్బంది పనితీరు, ఆయా సచివాలయాల్లో పై అధికారులు ఇచ్చిన పనులు ఎప్పుడు పెండింగ్ లోనే ఉంటాయి. మరి ఇది ఇలా ఉంటేసచివాలయ సిబ్బంది సమయపాలన పాటించరని , సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజల విమర్శ. దృవపత్రాల కోసం సచివాలయం ముందు పడిగాపులు కాయాల్సి వస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమయపాలన పాటించని సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు మీనవేషాలు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మండలంలోని 26 గ్రామపంచాయతీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.కొన్ని సచివాలయాల్లో ఉదయం పూట సకాలంలో సచివాలయాలకు చేరుకొని వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉన్నారంటే ఏ విధంగా అలసత్వంగా ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. పై అధికారుల తనిఖీలు పర్యవేక్షణలు పూర్తిగా లేకపోవడంతో సిబ్బంది ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. కొందరు సచివాలయ సిబ్బంది పై అధికారుల అండదండలతో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న విమర్శ కూడా ఉంది. ఎక్కువ శాతం సిబ్బంది సెలవుల్లో ఉంటున్నారు. సచివాలయాల్లో సిబ్బంది రేష్మలైజేషన్ చేసినప్పటికీ కొన్ని సచివాలయంలో సిబ్బందికి పని తక్కువగానే ఉంది. తప్పులు చేయడానికి సచివాలయ సిబ్బంది భయపడాలి . అలాంటిది తప్పు చేసిన వారికి కేవలం షోకాజు నోటీసులతో సరిపెడుతున్నారు. ఇది పర్చూరు మండలంలో పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం పై సిబ్బంది పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నారు.







కామెంట్‌లు (0)