బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కన్నీటిపర్యంతమైన మొగసాల కృష్ణమూర్తి

27 నిమిషాల క్రితం

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 30 ఏళ్లుగా మండల అభివృద్ధికి కృషి చేశా..

- ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి ఉద్వేగానికి గురయ్యారు. స్థానిక సెంటర్ బస్టాండ్ సమీపంలోని మసీదులో మైనార్టీ సోదరులను కలిసి ఓట్లు అభ్యర్థించే క్రమంలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. గత 30 సంవత్సరాలుగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం తాను ఎంతో కృషి చేశానని, ఏ ఒక్కరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. తాను డబ్బులు తీసుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీల నిర్మాణంతో పాటు పశువుల ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు, కోట్లాది రూపాయలతో బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల నిర్మాణం, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మండల అభివృద్ధిలో తన సోదరుడు మొగసాల రెడ్డప్ప, ఆయన సతీమణి మాజీ జడ్పీ చైర్‌పర్సన్ రెడ్డమ్మతో పాటు పలువురు నాయకులు ఎంతో శ్రమించారని గుర్తుచేశారు. తన కుమారుడు రాజును సర్పంచ్‌గా ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని మైనార్టీ సోదరులను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల రెడ్డప్ప, మాజీ సర్పంచ్ వెంకటేష్, సర్పంచ్ అభ్యర్థి రాజు, తబరేజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. మసీదు పెద్దలు ముత్తవల్లి బషీర్ సాబ్, షబ్బీర్, మహబూబ్ బాషా తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్