బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రచారంలో దూసుకుపోతున్న గుట్టపాలెం సర్పంచ్ అభ్యర్థి విజయకుమారి

28 నిమిషాల క్రితం

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- నల్లారి ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధే లక్ష్యమని వెల్లడి

ప్రజాశక్తి-కలికిరి: గుట్టపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లం విజయకుమారి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రజలతో మమేకమై పంచాయతీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ప్రస్తావించారు. నల్లారి నాయకత్వం, ఆశీస్సులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామంలో మెరుగైన రహదారులు, పారిశుధ్యం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను సేకరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆమె తెలిపారు.

గుట్టపాలెం సర్పంచ్ అభ్యర్థి పల్లం విజయకుమారి ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కే.వెంకటరమణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఎంపిటిసి రాజగోపాల్ రెడ్డి,, మాజీ ఎంపీటీసీ ఎతేంద్ర, నాయకులు సైఫుల్ల, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్