బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు

27 అక్టోబర్, 2026

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు 

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : అర్నాబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ సూచించారు. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా హైవేలపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. అయితే నిత్యావసర సరుకులను సరఫరా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం క్రింది నంబర్లకు కాల్ చేయవచ్చు.

​కంట్రోల్ రూమ్ నంబర్లు:

- జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్: 9494933233

- జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్: 9490619298

- కాకినాడ ఎస్డీపివో కార్యాలయం: 9440796505

- పెద్దాపురం ఎస్డీపివో కార్యాలయం: 9440796508

- అత్యవసర పోలీసు సేవలు: 112

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్