ప్రజాశక్తి -కడియం : కడియం మండలం పాస్టర్స్ ఫెలోషిప్, సిఇఎం ఆసుపత్రి ధవళేశ్వరం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కడియం ఆర్సిఎల్ చర్చి ప్రాంగణంలో ఫెలో షిప్ ప్రెసిడెంట్ డి.ఎల్ మూడి, జిల్లా ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ ఎం.కరుణాకర్, రీజనల్ చైర్మన్ డి.పరంజ్యోతి గురువారం ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సిఈఎం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బి. జయప్రశాంత్, డాక్టర్ కె.సౌజన్య బృందం వందలాది మందికి వైద్య సేవలు అందించి ఉంచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జగదీష్ ప్రసాద్, పాస్టర్ నవీన్, రెవ. జయశీల్, బిషప్ జే.సొలోమోను, రెవ సిహెచ్.రత్నదీప్, పాస్టర్ సామ్యూల్ రాజు, రెవ ఎలీషా, రెవ ప్రసన్న కుమార్, రెవ యెషయాలు పాల్గొన్నారు.
పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)