గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచ దోమల దినోత్సవం

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేపాడ : ప్రపంచ దోమల దినోత్సవాన్ని గురువారం గ్రామంలో నిర్వహించారు. దోమల వలన కలిగే వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు దోమతెరలు పంపిణీ చేశారు. వేపాడ మండలం కేజీ పూడి పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు గిరిజన గ్రామాలైన కోటయ్య గరువు, బందవలస, పాతూరు ఎస్టి కాలనీలో ఇంటింటికి దోమతెరలు పంపిణీ చేశారు. వాటి వలన కలిగే ప్రయోజనాలను డాక్టర్ శివాని గిరిజనులకు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమములో టిడిపి నాయకుడు పరవాడ జగదీష్, సుకురు గంగులు, కేదాటి సత్తిబాబు, దారప్ప, పాత బోయిన అర్జున్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఏ ఎన్ ఎం, ఆశ వర్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్