ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : గ్రీన్ రీసెర్చ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ నెట్‌వర్కింగ్ పై (ICGREEN-2026) ఒ.ఎన్.జి.సి సహకారంతో, రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం వారు సెప్టెంబర్ 18, 19 తేదీలలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశోధకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు, విద్యార్థులు మరియు పరిశ్రమ నిపుణులు పాల్గొని గ్రీన్ రీసెర్చ్, సస్టైనబుల్ టెక్నాలజీస్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్ మరియు పర్యావరణ సుస్థిరత వంటి అంశాలపై చర్చించనున్నారు. పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు పోస్టర్ మరియు ఓరల్ ప్రజెంట ప్రజెంటేషన్స్ ద్వారా తమ పరిశోధనలను ప్రదర్శించవచ్చు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేయనున్నారు.ఈరోజు ఈ సదస్సుకి సంబంధించిన ఫ్లయర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డా. రామచంద్ర ఆర్.కె. గారు విడుదల చేశారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి టి. శ్రీనివాసరావు, విభాగ అధ్యాపకులు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. తేజస్విని పాల్గొన్నారు.
గ్రీన్ రీసెర్చ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ నెట్‌వర్కింగ్‌పై అంతర్జాతీయ సదస్సు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)