బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిక్కింలో హై అలర్ట్‌.. 40 ప్రమాదకర హిమానీనద సరస్సులు గుర్తింపు

1 గంట క్రితం

High alert in Sikkim; 40 dangerous glacial lakes identified.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేపాల్ : నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు నేపథ్యంలో .... ఆ దేశ సరిహద్దులోని సిక్కిం రాష్ట్రంలోనూ అధికారులు అప్రమత్తత ప్రకటించారు. రాష్ట్రంలోని 40 అత్యంత ప్రమాదకర హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించింది. వీటిలో ఏడు సరస్సులను ‘అధిక ముప్పు’ జాబితాలో చేర్చింది. కొన్ని సరస్సులు సముద్రమట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సరస్సులు బద్దలైతే సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు సిక్కిం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం గుర్తించిన సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయంగా మదింపు చేస్తున్నట్లు రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ తాంబే తెలిపారు. సరస్సుల లోతు, నీటి పరిమాణంతో పాటు హిమపాతం, కొండచరియలు విరిగిపడే ముప్పును కూడా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. నేపాల్‌లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలవడంతో నదులు ఉప్పొంగి గ్రామాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 1,100 దాటగా.. మరో 4 వేల మంది గల్లంతైనట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్