ప్రజాశక్తి - ఉండ్రాజవరం: ముంపు నుంచి కాపాడండి అంటూ ప్రజాశక్తి దినపత్రికలో, మే నెలలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. మోర్త-చివటం డ్రైన్ గుర్రపు డెక్క తో పూడుకుపోయి, తరచూ పరిసర ప్రాంతాలు ముంపుకు గురవుతుండడం తో స్థానికులు దోమల బెడద నుండి కాపాడండి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పాలకులు, అధికారులు ప్రక్షాళన పనులు చేపట్టారు. ఓ అండ్ ఎం నిధులు సుమారు 19 లక్షల రూపాయలతో, సుమారు రెండు కిలోమీటర్ల మేర పూడికతీత పనులు ప్రారంభించినట్లు ఏ ఈ, కే ఈశ్వరి తెలిపారు. పెరవలి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాస్ పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ఏం సి చైర్మన్ జిన్నా బాబు, చివటం పిఎసిఎస్ అధ్యక్షులు ముళ్ళపూడి చిన వెంకట పాండురంగారావు, ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి వార్తకు స్పందన... మోర్త - చివటం డ్రైన్ లో పూడిక తొలగింపు పనులు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)