గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపుష్కరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రనకు ప్రత్యేక కార్యాచరణ

51 నిమిషాల క్రితం

Special action plan for plastic-free drinking water supply during Godavari Pushkaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 10:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి, వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సమర్థవంతంగా సేకరించి రీసైక్లింగ్ చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై బేవరేజ్ సంస్థల ప్రతినిధులతో విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలను కుంభమేళా తరహాలో భారీ స్థాయిలో నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు గోదావరి తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో తాగునీరు, పానీయాల సరఫరా ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైన మేరకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. వృక్షాధారిత పదార్థాలు, పేపర్ వంటి వాటితో రూపొందించిన పర్యావరణహిత సీసాలు, ఇతర ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ విధానాల వినియోగంపై పరిశ్రమలు పరిశీలన చేయాలని కోరారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ సీసాలకు బదులు అవసరమైన ప్రాంతాల్లో వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయడం, పునర్వినియోగానికి అనువైన సీసాలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని బేవరేజ్ సంస్థలకు సూచించారు. పరిశ్రమలు తమ వనరులు, సామర్థ్యానికి అనుగుణంగా పుష్కర ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా కోసం స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగం అనంతరం నిర్లక్ష్యంగా పడవేయకుండా, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేసే వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్