బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

26 అక్టోబర్, 2026

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమండ్రి : ప్రభుత్వ కళాశాలలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆదికవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్. కె మాట్లాడుతూ.. రామాయణం సర్వకాల ఆచరణీయ గ్రంథమని, విద్యార్థులు రామరాజ్య భావన, తల్లిదండ్రుల పట్ల గౌరవం, నైతిక విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం. వసంతలక్ష్మి మాట్లాడుతూ.. వాల్మీకి రామాయణం మానవ సంబంధాలు, ధర్మబద్ధ జీవితం, క్రమశిక్షణను నేర్పే మార్గదర్శి అని అన్నారు. తెలుగు విభాగాధిపతి ఎం. సుధామయి మాట్లాడుతూ.. వాల్మీకి వేసిన పునాదులు తెలుగుతో సహా భారతీయ భాషల సాహిత్య వికాసానికి మూలస్తంభాలని అన్నారు. హిందీ విభాగాధిపతి ఉషారాణి మాట్లాడుతూ .. రామాయణం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, వాల్మీకి బోధనలు నేటికీ ప్రాసంగికమని అన్నారు. తెలుగు అధ్యాపకురాలు బి. సుబ్బలక్ష్మి మాట్లాడుతూ .. యువత ఆదర్శ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం సంస్కృత విభాగం ఇన్-ఛార్జ్ షేక్ జరీనా బేగం పర్యవేక్షణలో జరగగా అధ్యాపకులు ఆర్.వి.వి. వందన, కె. దినేష్ బాబు, బి. గాయత్రి నిర్వహణను పర్యవేక్షించారు. వేడుకల్లో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్