శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరవైఏళ్ళు పైబడిన ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి : యుటిఎఫ్ నేతల వినతి

52 నిమిషాల క్రితం

అనారోగ్యం, 60 ఏళ్ళు పైబడిన ఉద్యోగులకు 
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలి
సబ్ కలెక్టర్‌కు యుటిఎఫ్ నేతలు వినతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న, 60 ఏళ్ళు పైబడిన ఉద్యోగులకు మినహాయింపు కల్పించాలని కోరుతూ ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పోలవరం జిల్లా నాయకులు శుక్రవారం రంపచోడవరం సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.విశ్వరాజ్, కె.సూరిబాబు మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణలో ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. 60 సంవత్సరాలు నిండిన ఉద్యోగుల వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించే అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగుల అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన మినహాయింపులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డి మహేష్, మండల అధ్యక్షులు సిహెచ్ సనాతన బాబు, తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్