* ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ సాగిన ప్రచారం
ప్రజాశక్తి-విజయవాడ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో సీపీఐ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థులు శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఎజెండా కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి మండలి సాక్షిగా పోరాడుతామని హామీ ఇచ్చారు. అలాగే స్వతంత్ర మేయర్ అభ్యర్థి ఎ.బి. వెంకటేశ్వరరావును గ్యాస్ బండ గుర్తుపై, సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థులను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై గెలిపించాలని కోరారు. 79వ డివిజన్ అభ్యర్థి షేక్ సైరా భాను సమక్షంలో నాయకులు వాటర్ ట్యాంక్, రెడ్డి గారి హోటల్, గంగమ్మ గుడి రోడ్డు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు టి.ప్రవీణ్, డి.స్టీఫెన్ బాబు, మన్యం నాగార్జున, షేక్ సలీం, జగ్గారెడ్డి, సీపీఐ నేత కంది ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 78వ డివిజన్ అభ్యర్థి కాశీ పూర్ణ శివ పార్వతి డివిజన్‌లోని వడ్డెర కాలనీ, మసీద్ ఏరియా, ఎం.బి. స్టేడియం రోడ్డు, సబ్ స్టేషన్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 73వ డివిజన్ అభ్యర్థి యలమంచిలి ఆదిలక్ష్మి.. జి+3 అపార్ట్‌మెంట్లు, వాటర్ ట్యాంక్, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. 81వ డివిజన్ అభ్యర్థి గంట శ్రీదేవితో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, నాయకులు చింతల శ్రీనివాస్, గంటా రాంబాబు ప్రచారంలో పాల్గొన్నారు. గాంధీపురం, ప్రశాంతినగర్‌లలో ప్రచారం చేశారు. 20 ఏళ్లుగా ఇంటి పట్టాలు రాకపోవడం, కలుషిత నీరు, దోమల బెడద వంటి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సీపీఎంకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 82వ డివిజన్ అభ్యర్థి బి. రజని.. డివిజన్‌లోని శాంతినగర్‌లో పార్టీ నాయకులు సిహెచ్. శ్రీనివాసరావు, అరుణ, విజయ తదితరులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.












కామెంట్‌లు (0)