శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నాన్నలా ఎవరుండరు మనకు..’

42 నిమిషాల క్రితం

‘నాన్నలా ఎవరుండరు మనకు..’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో దర్శకుడు ము. మారన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘నాన్నలా లోకములో ఎవరుండరు మనకు’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. కన్నబిడ్డల కోసం తండ్రి పడే కష్టాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ పాట హృద్యంగా ఉంది. విజయ్‌ ఆంటోని స్వరాలు సమకూర్చగా, భాష్యశ్రీ సాహిత్యం అందించారు. మౌషిమి నేహా ఆలపించారు. ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోనీయే సంగీతం అందించడంతో పాటు నిర్మాణ బాధ్యతలూ చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్