ప్రజాశక్తి - కపిలేశ్వరపురం
అర్నబ్ తుపాన్ ప్రభావంతో మండలంలో సుమారు 16వేల ఎకరాల్లో వరి పంట నేలవారిందని మండల వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గురువారం మండల వ్యవసాయ అధికారి బి.రవి వివిధ గ్రామాల్లో పర్యటించారు. రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల ద్వారా వీలైనంత త్వరగా నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలని, వరి పంటకు పొడ తెగులు, దోమపోటు సోకే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)