ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం సమీపంలో రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని మహిళ మరణించింది. ప్లాట్ఫారం చివరన బహిర్భూమికి వెళ్లే క్రమంలో వట్లూరు వైపు నుంచి వస్తున్న రైలును గమనించకుండా పట్టాలు దాటుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు వేగంగా ఢీకొట్టడంతో ఆమె శరీరం రెండు తునకలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను గమనించిన లోకో పైలట్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఏలూరు జీఆర్పీ (GRP) ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి ఆనవాళ్లు ....
మృతి చెందిన మహిళ వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమె ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు, చామనఛాయ రంగుతో ఉంది. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆమె స్వస్థలం ఇంకా తెలియరాలేదు. మృతురాలి ఆచూకీ లేదా ఇతర వివరాలు తెలిసిన వారు కృపాదానం (సెల్ నెంబర్: 9440 411 000) ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.








కామెంట్లు (0)