విద్యారంగానికి తీరని లోటు.. డాక్టర్ నన్నపనేని మంగాదేవి గారి మృతి పట్ల మేయర్ లక్ష్మీ అపర్ణ గారి తీవ్ర సంతాపం
విద్యాసేవకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సేవామూర్తికి ఘన నివాళి
గుంటూరు : గుంటూరు విద్యారంగంలో విశేష సేవలందించిన శ్రీ వెంకటేశ్వర బాలకోటి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి శుక్రవారం చోడవరంలోని చేతన ఫౌండేషన్ ఆవరణలో కన్నుమూయడం పట్ల గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ మంగాదేవి భౌతికకాయాన్ని సందర్శించి, పుష్పాంజలి ఘటించి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగ అభివృద్ధికి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సేవామూర్తిని కోల్పోవడం గుంటూరు నగరానికి తీరని లోటని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అందించిన విద్యా సేవలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.








కామెంట్‌లు (0)