చలో పార్లమెంట్ బ్యానర్స్ ఆవిష్కరణ..
లేబర్ కోడ్స్ రద్దు.... కనీస వేతనం 42 వేలు,..
సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్
రెడ్డిగూడెం (ఎన్టీఆర్) : డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం సిఐటియు కార్యాలయంలో పోల్ బ్యానర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU ఎన్టీఆర్ జిల్లా సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ ... 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, అసంఘటిత కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. SIR రద్దు చేయాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని, నీరు అడవి భూమి పై ప్రజల హక్కు కాపాడాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు చలో ఢిల్లీ, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అన్ని రంగాల ప్రజలు, కార్మికులు పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.రామారావు, ఏ.శ్రీను, ఈ.రామకృష్ణ, పుల్లయ్య, నారాయణ, జి.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)