శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సురేష్ బాబుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ... రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని జిల్లా విద్యాధికారి సలీం భాషా చేతుల మీదుగా పొన్నెకంటి సురేష్ బాబు అందుకున్నారు. ఆయన అత్తోట ఎంపిపిఎస్ (ఎఇ) పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని శంకరన్ హాలులో శనివారం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి సత్కరించి, ప్రశంస పత్రాలను అందించారు. పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రత్యేకంగా అభినందించారు. గతంలో బొల్లాపల్లి మండలంలో ఎనిమిది సంవత్సరాలు మండల రిసోర్స్ పర్సన్ గా విస్తృతమైన సేవలందించిన సురేష్ బాబు ఎస్టియు కొల్లిపర జనరల్ సెక్రటరీగా ఉపాధ్యాయ వర్గాల సమస్యలపై పనిచేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటం, ఫలితంగా పాఠశాలకు రెండవ పోస్ట్ కూడా మంజూరు కావడం వంటి పురోగతిని లీప్ యాప్ ద్వారా పరిశీలించిన అధికారులు తనను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసినట్లు సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సహచర ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు సురేష్ బాబును అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్