బలిజిపేట (మన్యం) : బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలో దేవరవీధి గ్రామస్తులకు సువర్ణముఖి నది నుండి దేవరవీధి దళితులకు రోడ్డు రహదారి పరిశుభ్రత లేక అసౌకర్యంగా ఉన్నందువలన గ్రామస్తులు నది నుండి ఇంటికి నీరు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. మంగళవారం అక్కడి మహిళలు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా మహిళలు తెచ్చుకోవడానికి రోడ్డు బాగోలేక చాలా ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. ఆ వీధి నుండి గ్రామస్తులు అంతమంది ఆ రహదారి నుండి స్నానాలకు, నీరు తెచ్చుకోవడానికి రద్దీగా ఉంటుంది అయినప్పటికీ పంచాయతీ అధికారులు రాజకీయ అధికారులు ఈ రోడ్డు గురించి బాగు చేసేవారు ఎవరూ లేరని తెలుపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ఈ రహదారిని శుభ్రం చేసి నది ఒడ్డున మెట్లు నిర్మాణం చేసి రహదారిని శుభ్రం చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారనీ, హామీ ఇచ్చి రెండు సంవత్సరములు పూర్తయినప్పటికీ ఇప్పటికే రోడ్డు మరమ్మతు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, గ్రామములో ఉన్న రాజకీయ నాయకులు స్పందించి అది ఒడ్డున మట్టి నిర్మాణమును ప్రారంభించి గ్రామస్తులకు ఉపయోగపడినట్లు రహదారిని శుభ్రం చేస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కొండరాళ్లు దాటేదెలా .. నీరు తెచ్చేదెలా ?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)