పురుషోత్తపట్నం అడ్డరోడ్డు వద్ద విషాదం..
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక పురుషోత్తపట్నం అడ్డరోడ్డు వద్ద సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక టైరు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం ... తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పురుషోత్తపట్నం అడ్డరోడ్డులోని బార్‌గేట్స్ సమీపంలోకి రాగానే ప్రయాణికులను దింపేదుకు నెమ్మదించింది. ఆ సమయంలో బస్సు నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దిగుతుండగా, వాహనం నెమ్మదిగా ముందుకు కదిలింది. అదే క్ర మంలో బార్‌గేట్ వద్ద నిల్చుని ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభిం చ లేదు. అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశం పై, మృతుడి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సి.ఐ. రమేష్ తెలిపారు.








కామెంట్‌లు (0)