బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కౌలురైతులకు రుణాల కోసం వినతులు

2 గంటల క్రితం

కౌలురైతులకు రుణాల కోసం వినతులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెదనందిపాడు

కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు కోరారు. బుధవారం నాగులపాడులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పెదనందిపాడులోని బ్యాంకు ఆఫ్ బరోడా, పాలపర్రులోని కెనరా బ్యాంకు మేనేజర్ లను కలిసి కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా, ఈ క్రాప్ నమోదు ఆధారంగా కౌలు రైతులను గుర్తించి బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం కౌలు రైతులకు హామీలేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. పంట భీమా పధకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కోరారు. జిల్లాలో 70 శాతం మంది కౌలు రైతులే భూమి సాగు చేస్తున్నారని అన్నారు. పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారన్నారు. కావున కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సిఐటియు మండల నాయకులు దొప్పలపూడి రమేష్ బాబు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఇనగంటి మొగలయ్య, రైతు సంఘం మండల నాయకులు జంపని రామారావు, ముద్దన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్