బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొండంగి మండలంలో విప్ యనమల దివ్య పర్యటన

4 రోజుల క్రితం

తొండింగ్ మండలంలో విప్ యనమల దివ్య పర్యటన image 1

తుఫాను వలన దెబ్బతిన్న కోన ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -తొండంగి

అర్నబ్ తుపాను వల్ల నష్టపోయిన మత్స్య కారులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య హామీ ఇచ్చారు. గురువారం తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న తొండంగి మండలంలోని ఎర్రయ్యపేట, వాడపంపాదిపేట తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించారు. బోట్లు, వలల సముద్రపు అలలకు కొట్టుకునిపోయి ఉపాధి లేకుండా పోయామని మత్స్యకారులు దివ్య వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య కారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జరిగిన నష్టంపై ఇప్పటికే అధికారులు ప్రాధమిక నివేదిక సిద్ధం చేశారని దివ్య తెలిపారు. పూర్తిగా సర్వే చేసి జరిగిన నష్టానికి అనుగుణంగా ప్రభుత్వ పరిహారం అందిస్తుందని యనమల దివ్య హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, నాయకులు పాల్గొన్నారు


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్