సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెముడులంకలో రూ. 54.70 లక్షలతో అభివృద్ధికి భూమిపూజ

55 నిమిషాల క్రితం

Bhoomi Puja performed for development works worth Rs 54.70 lakh in Chemudulanka.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంకలో రూ.54.70 లక్షలతో అభివృద్ధి పనులకు సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, కూటమి నాయకులతో కలిసి సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా రూ. 50 లక్షలతో పైప్ లైన్ నిర్మాణానికి, సచివాలయం 2 కి రూ. 2 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి, స్థానిక శ్రీనివాస్ నగర్ లో రూ. 2.70 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మరి ముఖ్యంగా సుమారు 25 ఏళ్లుగా దీర్ఘకాలికంగా వివిధ కారణాలతో అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయిన శ్రీనివాస్ నగర్ లో సిసి రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దపీట వేస్తు అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయిస్తూ ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నాగిరెడ్డి సత్యానందం, కొత్తపల్లి రాంబాబు, శిరంగుల సతీష్, గుండుమల్ల రాంబాబు, అడబాల వీర్రాజు, తమ్మన ఏసు, పేరపు చిన్న, తమ్మన గోపాలకృష్ణ, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్