న్యూఢిల్లీ : సోనియాగాంధీ ఎన్నికల జాబితా కేసులో విచారణను తిరస్కరిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ కోర్టు సోమవారం కొట్టివేసింది. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు "వివరణ లేనిది" అని పేర్కొంటూ .. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే కొట్టివేశారు. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 175(3) నిబంధనలను పాటించకపోవడం, సంబంధిత పోలీస్ అధికారి వాదనలను వినకపోవడం, పోలీస్స్టేషన్ నుండి స్టేటస్ కో నివేదికను తీసుకోకపోవడంతో ఈ ఉత్తర్వులు చట్టబద్ధంగా లోపభూయిష్టంగా ఉన్నాయని జడ్జి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించడం, బిఎన్ఎస్ఎస్ కింద చర్యలు చేపట్టడం అనే చరట్టపరమైన రెండు ప్రత్యామ్నాయ మార్గాలను మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆ ఉత్తర్వు వివరణలేనిదిగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చట్టబద్ధమైన విచారణ జరపాలని ఆదేశిస్తూ .. ఈ అంశాన్ని తిరిగి మెజిస్ట్రేట్ కోర్టుకు పంపారు. కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. భారత పౌరసత్వం పొందడానికి ముందే కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ పేరును ఎన్నికల బితాలో చేర్చడంపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్ట్స్ సెంట్రల్ ఢిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ను దాఖలు చేశారు.








కామెంట్లు (0)